LSG ఓటమి..గోయెంకా–పంత్ వీడియో!

5
- Advertisement -

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లక్నోలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఓటమి పాలైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత గోయెంకా, పంత్ మరియు లాంగర్ మైదానంలో మాట్లాడుకుంటూ కనిపించారు. గోయెంకా ఏదో విషయంపై వారికి సూచనలు ఇస్తుండగా, పంత్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వీడియోలో కనిపించగా ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు ఒక దశలో 26/4 స్కోరుతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే, సమీర్ రిజ్వీ మరియు ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించారు. వీరిద్దరూ కలిసి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆరు వికెట్ల తేడాతో గెలిపించారు.

మొదట LSG బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపించారు. షమీ తన తొలి బంతికే KL Rahul ను ఔట్ చేసి మంచి ఆరంభం ఇవ్వగా నితీష్ రాణాను మోహ్సిన్ ఖాన్ పెవిలియన్‌కు పంపాడుఉ. తర్వాత ప్రిన్స్ యాదవ్… వరుసగా రెండు వికెట్లు తీసి పాథమ్ నిస్సాంకా, అక్షర్ పటేల్‌లను పెవిలియన్‌కు పంపాడు.

అయితే, రిజ్వీ–స్టబ్స్ జోడీ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. రిజ్వీ తొలి 10 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసినా, చివరికి 47 బంతుల్లో 70* పరుగులతో అజేయంగా నిలిచాడు. స్టబ్స్ 32 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. ఈ జోడీ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

Also Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

 

- Advertisement -