సన్‌రైజర్స్‌పై కోల్‌కతా..ముంబైపై ఢిల్లీ ఘనవిజయం

298
mumbai vs delhi captails
- Advertisement -

ఐపీఎల్‌ 12లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టాయి. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయతీరాలకు చేరింది.

చివరివరకు విజయం ఖాయమనుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును సునామీలా ముంచేశాడు వెస్టీండిస్ ఆల్‌రౌండర్‌ రసెల్‌ . 18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓటమి దిశగా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌… రసెల్ విధ్వంసంతో  విజయ తీరాలకు చేరింది. రసెల్‌ (49 నాటౌట్‌; 19 బంతుల్లో 4×4, 4×6), నితీష్‌ రాణా (68; 47 బంతుల్లో 8×4, 3×6) చెలరేగడంతో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన డేవిడ్‌ వార్నర్‌ (85; 53 బంతుల్లో 9×4, 3×6) మెరవడంతో మొదట హైదరాబాద్‌ 3 వికెట్లకు 181 పరుగులు చేసింది. కోల్ కతా విజయంలో కీలకపాత్ర పోషించిన రసెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇక మరో వ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని మట్టికరిపించింది ఢిల్లీ. ముంబైని దాని సొంతగడ్డపై మట్టికరిపించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. ముంబయిలోని వాంఖడెలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 37 పరుగుల తేడాతో నెగ్గింది. యువ సంచలనం రిషబ్‌ పంత్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ (78 నాటౌట్‌; 27 బంతుల్లో 7×4, 7×6)తో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై 19.2 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. యువరాజ్‌ (53; 35 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్‌. ఇషాంత్‌ (2/34), రబాడ (2/23) ముంబయిని దెబ్బ తీశారు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రిషబ్‌కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది.

- Advertisement -