కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…

352
delhi polling
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 70 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఒక కోటి 46లక్షల 92వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినిగియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 80.55 లక్షలు, మహిళ ఓటర్లు 66.35 లక్షల మంది ఉన్నారు. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా 13వేల మంది ఎన్నికల సిబ్బందితో సహా 90వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

అత్యధికంగా న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు, అత్యల్పంగా పటేల్ నగర్ అసెంబ్లీ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బరిలో ఉండగా ఈ నెల 11వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -