దీపికా, రణ్‌వీర్ ల పెళ్లి డేట్ ఫిక్స్..

325
deepika ranveer
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌, రణ్‌వీర్ సింగ్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఆమె ట్విటర్ ద్వారా తీపి వార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సాగిన ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ సినిమాల కంటే ప్రేమ వ్యవహారాల్లోనే ఈ జంట ఎక్కువసార్లు వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు.

deepika

వీరిరువురు తమ ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నవంబర్ 14,15వ తేదీల్లో మా పెళ్లి జరగబోతోందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.ఇన్నేళ్లు మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ప్రేమ, స్నేహం, నమ్మకంతో మేం కలిసి చేయబోతున్న ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ప్రేమతో మీ దీపిక, రణ్‌వీర్‌’ అంటూ పెళ్లి కార్డును కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

deepikaranveermarriageఇప్ప‌టికే వీళ్లు పెళ్లి త‌ర్వాత ఉండాల్సిన ఇంటిని కూడా త‌మ అభిరుచికి త‌గిన‌ట్లు మ‌ల‌చుకున్నారు. ఇక దీపిక, రణ్‌వీర్ కలిసి ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.అయితే వీరి పెళ్లి వార్త విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన జంట పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -