- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ చైర్మన్ గా నియామకం అయిన సందర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి.
ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ చైర్మన్ నియమించినందుకు గాను మొట్టమొదటగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -