దీపికా ఫన్నీవాక్‌..చూస్తే నవ్వాపుకోలేరు..!!

215
Deepika Padukone's FUNNY Catwalk Moment On BFFs
- Advertisement -

తెర మీదే కాదు.. తెర వెనుక కూడా కొంత‌మంది హీరోయిన్లు సరదాగా అల్ల‌రి ప‌నులు చేస్తుంటారు. అలాంటి ఓ చిలిపి ప‌నే చేసింది దీపికా పదుకునే. సాధారణంగా మోడళ్లు, హీరోయిన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై క్యాట్‌వాక్‌తో హోయలొలికిస్తుండటం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు దీపిక తన స్టైల్‌లో ఓ కొత్తరకం క్యాట్‌ వాక్‌ కనిపెట్టినట్టుంది. ఆమె క్యాట్‌వాక్‌ చేసిన తీరు చూస్తే నవ్వకుండా ఉండలేరు.

‘బీఎఫ్‌ఎఫ్‌ వోగ్‌’ కార్యక్రమంలో దీపిక తన సోదరి అనీశా, నటి నేహా ధుపియాతో కలిసి పాల్గొంది. అక్క‌డ నిర్వ‌హించిన ఫ‌న్నీ ఆట‌ల్లో భాగంగా ఆమె ఇలా న‌డిచిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా ప‌దుకునే న‌టించిన ‘ప‌ద్మావ‌త్‌’ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత దీపిక ‘సప్నా దీదీ’ బయోపిక్‌లో నటించ‌బోతోంది.

- Advertisement -