ఎల్‌ అండ్ టీ ఛైర్మన్‌పై దీపికా అసహనం

0
- Advertisement -

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యన్ కామెంట్స్‌పై స్పందించారు దీపికా.

ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్‌గా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించిన దీపికా..మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది.

సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పారు ఎల్ అండ్ టీ ఛైర్మన్. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు అని చెప్పారు.

Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి

- Advertisement -