పెళ్లిళ్ల పై దీపికా షాకింగ్ కామెంట్స్

34
- Advertisement -

నేటి తరంలో వివాహ బంధాలకు విలువ లేకుండా పోయిందని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె తెలిపింది. ”నేటి తరం భార్యాభర్తలకు సహనం లేదు. వివాహ బంధం ధృడంగా ఉండాలంటే సహనం ముఖ్యం. ప్రస్తుత తరం వారు పాత తరం వారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలి”అని పేర్కొంది. కాగా 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపికా పడుకొణె ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా దీపికా పడుకొణె లీడింగ్ లో ఉంది. బాలీవుడ్ లో టాప్ త్రీ పొజిషన్లలో దీపికా పడుకోణె.. శ్రద్ధా కపూర్.. కియారా అద్వానీ కనిపిస్తున్నారు.

అలియా భట్ లాంటి నెంబర్ వన్ హీరోయిన్ కి పెళ్లి అయిపోవడం, పైగా అలియా తల్లి అయిపోవడంతో ఆమె ఇప్పట్లో మళ్లీ హీరోయిన్ గా నటించేలా కనిపించడం లేదు. సో.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ లో ఉన్న దీపికా, శ్రద్ధా కపూర్, కియారా ముగ్గురిలో దీపికా పడుకోణె దే ముందడుగు అని చెప్పాలి. క్రితం ఏడాది వచ్చిన పఠాన్ సినిమాతో దీపికా పడుకోణె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పైగా త్వరలో ప్రారంభం కానున్న పలు తెలుగు సినిమాల్లో దీపికా పడుకోణె పేరు వినిపిస్తోంది.

Also Read: నేను మిస్ వరల్డ్..నిక్ వయసు ఏడేళ్లు:ప్రియాంక చోప్రా

వాటిల్లో ప్రముఖంగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోందట. అలాగే ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా దీపికా పడుకోణెనే నటిస్తోంది అంటూ టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో కూడా దీపికా పడుకోణెని అనుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు దీపికా పడుకోణెని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీపికా పడుకోణె, ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కె లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: పవన్ దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది

- Advertisement -