హీరోలపై దీపికా ఆసక్తికర కామెంట్స్!

18
- Advertisement -

ఇండస్ట్రీలో పని గంటలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించను అని స్పష్టం చేశారు.చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా రోజుకి 8 గంటల పని మాత్రమే చేస్తున్నారు. ఇది ఎటువంటి రహస్యమైన విషయం కాదు అని కామెంట్ చేశారు.

వారంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తూ, వీకెండ్స్‌ పూర్తిగా వారి సొంత ప‌నులు చేసుకుంటారు అని చెప్పారు.

పలు ప్రాజెక్టుల నుండి తప్పుకోవడంపై ఇలాంటి పరిస్థితులు నాకు కొత్తకావు. ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా చేశాను. వాటిపై ప్రతిస్పందించడంలో ఆసక్తి లేదు. గౌరవంగా ఉండాలంటే సైలెంట్‌గా పోరాటం చేయడం నేర్చుకోవాలి అన్నారు.

Also Read:Dude Trailer:‘డ్యూడ్’ ట్రైల‌ర్

- Advertisement -