‘దీపికా పడుకోణె’తో ఐటెమ్ సాంగ్?

25
- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ‘దీపికా పదుకోణె’లా డ్యాన్స్ చేసే హీరోయిన్ లేదు. ఆమె డ్యాన్స్ చేస్తే ఆమె ఎనర్జీకి మ్యాచ్ అయ్యేందుకు హీరోలు కూడా అపసోపాలు పడాల్సిందే. “వామ్మో అదేమి డ్యాన్స్ దీపికా… అదేమీ ఎనర్జీ” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. దీనికితోడు దీపికా పదుకోణె సాంగ్ లో ఎలాగూ బికినీల మోత మోగిస్తోంది.ఎక్స్ పోజింగ్ కూడా సిగ్గు పడేలా అందాల ఆరబోతతో దీపికా పదుకోణె రెచ్చిపోతుంది. కాబట్టి, ఆమె డేట్స్ కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.

ఇప్పటివరకు ఈ భామ నార్త్ హీరోయిన్ గా మాత్రమే సినిమాలు చేసింది. మొదటిసారి సౌత్ లో దీపికా పదుకోణెతో ఒక స్పెషల్ సాంగ్ చేయించాలనే ఆలోచన వచ్చిందట దేవర సినిమా టీంకి. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్న “దేవర పార్ట్ 1” సినిమాలో ఐటెం సాంగ్ ని ఒక బాలీవుడ్ భామతో చేయించాలని భావిస్తోంది టీం. మొదట, కృతి సనన్ దగ్గర నుంచి కియారా అద్వానీ, దిశా పటాని వంటి భామల పేర్లను పరీశీలించారు. ఐతే, దేవర పాన్ ఇండియా సినిమా. పైగా పార్ట్ 2 కూడా రాబోతుంది.

అందుకే, పార్ట్ 1 లోని ఐటమ్ పాట దేశం మొత్తాన్ని ఊపేయాలి. అలా ఊపాలి అంటే.. దీపికా పదుకోణె లాంటి హీరోయిన్ కి మాత్రమే సాధ్యం. అందుకే, ఇప్పుడు ఎన్టీఆర్ టీమ్, దీపికా పదుకోణె వెంట పడుతుంది. మరి దీపికా పదుకోణె ఈ ప్రొపోజల్ తన వద్దకు వస్తే ఊ అంటుందా? ఊఊఁ అంటుందా?. భారీ రెమ్యునరేషన్ ఇస్తే.. కచ్చితంగా దీపికా పదుకోణె ఒప్పుకుంటుంది. పైగా అందరూ సిగ్గు పడేలా ఎక్స్ పోజింగ్ కూడా చేస్తోంది. మరి చివరకు దేవర కోసం దీపికా ఐటమ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read:బొప్పాయి గింజలతో.. ఇంత ప్రమాదమా!

- Advertisement -