స్టార్ హీరోయిన్ కొత్త బిజినెస్ లు

24
- Advertisement -

దీపికా పడుకోణె నార్త్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్. సినిమాకి కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఏ తెలుగు, తమిళ హీరోయిన్ కి ఇవ్వనంత డబ్బు దీపికా పడుకోణె కి ఇస్తున్నారు. ఆమె సినిమాకి 7 నుంచి 9 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. నిర్మాత, ప్రాజెక్ట్ ని బట్టి పారితోషికం అటు ఇటుగా ఉంటుంది. హీరోయిన్ గా కోట్లు సంపాదిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా బోలెడంత గడుస్తునే ఉంది. ఇప్పుడు వ్యాపారంలో కూడా దీపికా పడుకోణె దూసుకుపోవాలని ఆశ పడుతుంది. ఇందులో భాగంగానే దీపికా పడుకోణె నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలోనే దీపికా పడుకోణె నిర్మాణ సంస్థ పెట్టబోతోంది. అలాగే హోటల్ వ్యాపారంలోనూ దీపికా అడుగుపెట్టబోతుంది. ఇందుకోసం ముంబైలో దీపికా పడుకోణె ఓ భారీ హోటల్ ను ఓపెన్ చేయాలని ఆలోచనలో ఉంది. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్, శరీర సంరక్షణ కు సంబంధించిన ఉత్పత్తులను లాంచ్ చేస్తోందట. దీపికా పడుకోణె, ఆమె భర్త రణ్ వీర్ సింగ్ ఇద్దరు కలిసి ఈ వ్యాపార రంగాల్లోకి అడుగుపెడుతున్నారట.

దీపికా పడుకోణె ఒకప్పుడు సాదాసీదాగా ఉండేది. రంగు, హంగు అంతా సాధారణమే. ఐతే, హీరోయిన్ గా ఒక మంచి పొజిషన్ కి వచ్చాక ఆమె కలర్, స్కిన్ టోన్ అంతా మారిపోయింది. సామాన్య యువతులు కూడా తనలా మారిపోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అని ప్రచారం చేస్తోంది. మొత్తానికి దీపికా పడుకోణెకి ప్రస్తుతం టైమ్ బాగా నడుస్తోంది. ఆమె నటిస్తున్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి.

Also Read:రూల్స్‌ రంజన్‌.. ప్రీ రిలీజ్‌

- Advertisement -