సౌత్ పై దీపికా పడుకోణె ముచ్చట్లు

25
- Advertisement -

ప్రభాస్ ‘కల్కి’ సినిమాతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి అడుగుపెట్టబోతున్న దీపికా పడుకోణె త్వరలో తల్లి కాబోతున్నా అని నిన్నే క్లారిటీ ఇచ్చింది. ఐతే, దీపికా పడుకోణె ఈ మధ్యన సౌత్ ముచ్చట్లు కూడా ఎక్కువ చెబుతోంది. ప్రభాస్ కల్కి సినిమాతో సౌత్ కి ఎంట్రీ ఇస్తోన్న దీపికా పడుకోణె ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ ‘వార్ 2’లో నటిస్తోంది. పైగా ఎన్టీఆర్ సరసనే నటిస్తోంది. అలాగే, చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది అని టాక్. మరి ప్రభాస్ – ఎన్టీఆర్ – చరణ లు గ్లోబల్ స్టార్స్.

సౌత్ లోనే ఈ ముగ్గురు పాన్ ఇండియా హీరోలు. దీపికా పడుకోణె సౌత్ లో కూడా ఇలాంటి పెద్ద హీరోల ఛాన్స్ లు అందుకోవడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. అటు తమిళ్ లోను సూర్య సినిమాతో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రభాస్ కల్కి సెట్స్ లో ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్టుగా, ప్రభాస్ తో కలిసి వర్క్ చెయ్యడం పట్ల ఫీలింగ్ హ్యాపీ అని చెబుతుంది దీపికా పడుకోణె. తాజాగా దీపికా పడుకోణె తెలుగులో నటించడంపై మరోసారి స్పందించింది.

తనకు తెలుగులో నటించడం ద్వారా తన కన్నడ మూలలను వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంది, తాను ఇప్పుడు తెలుగు భాషని కూడా నేర్చుకుంటున్నట్లుగా చెప్పింది. తనకి ఇండియన్ సినిమా, అలాగే క్రికెట్ అంటే చాలా ఇష్టమని. అందులోను సచిన్, యువరాజ్ లు అంటే బోలెడంత ఇష్టమని చెప్పిన దీపికా పడుకోణె.. తాను నార్త్ నుంచి సౌత్ లో కూడా నటించడం చూసాక నా లైఫ్ గుండ్రంగా తిరిగినట్లుగా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా ‘వ‌ళ‌రి’ ట్రైలర్

- Advertisement -