దీపికా చేతుల్లోకే హిందీ తెర

42
- Advertisement -

బాలీవుడ్ లో టాప్ త్రీ పొజిషన్లలో దీపికా పడుకోణె.. శ్రద్ధా కపూర్.. కియారా అద్వానీ కనిపిస్తున్నారు. అలియా భట్ లాంటి నెంబర్ వన్ హీరోయిన్ కి పెళ్లి అయిపోవడం, పైగా అలియా తల్లి అయిపోవడంతో ఆమె ఇప్పట్లో మళ్లీ హీరోయిన్ గా నటించేలా కనిపించడం లేదు. సో.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ లో ఉన్న దీపికా, శ్రద్ధా కపూర్, కియారా ముగ్గురిలో దీపికా పడుకోణె దే ముందడుగు అని చెప్పాలి. క్రితం ఏడాది వరకు వరుస పరాజయాలు దీపికా పడుకోణె ఎకౌంట్లో పడ్డాయి.

కానీ, ఈ ఏడాది వచ్చిన పఠాన్ సినిమాతో దీపికా పడుకోణె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క సాహో సమయంలో టాప్ లో ఉన్న శ్రద్ధా కపూర్ బాగా వెనుకబడి పోయింది. ఆమె ఖాతాలో వరుసగా ప్లాప్ లు వచ్చి పడుతున్నాయి. పైగా శ్రద్ధా కపూర్ నుంచి ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒక రకంగా శ్రద్ధా కపూర్ ప్లానింగ్ లోపంగానే చెప్పాలి. కాబట్టి నెంబర్ వన్ బాలీవుడ్ హీరోయిన్ కిరీటాన్ని శ్రద్ధా కపూర్ చేజేతులారా పోగొట్టుకుంది.

ఇక కియారా అద్వానీ విషయానికొస్తే .. క్రితం ఏడాది వరకు ఫ్యూచర్ నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో కియారా అద్వానీ లేకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా ఆమె ఆ స్థాయిని రీచ్ అవుతుందని అందరూ భావించారు. అయితే, కియారా అద్వానీ మాత్రం సైలెంట్ గా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యిపోవాలని ఫిక్స్ అయ్యిపోయింది.

ఒకవేళ కియారా అద్వానీ పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ కచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి.. కియారా అద్వానీ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడం అసాధ్యం. ఇప్పుడన్న పరిస్థితులను బట్టి.. నెంబర్ వన్ పొజిషన్ కోసం జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు పోటీ పడొచ్చు. కానీ ప్రస్తుతానికి ఐతే హిందీ తెర దీపికా చేతుల్లోకే వెళ్ళిపోయింది.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్ 28,2023న…ఏజెంట్

వీరమల్లు రావడం కష్టమేనా?

ఎన్టీఆర్ నుంచి సర్ ప్రైజింగ్ న్యూస్

- Advertisement -