దీపికా–రణవీర్..వెడ్డింగ్ మూమెంట్!

9
- Advertisement -

ఒక ఫ్యామిలీ వెడ్డింగ్‌లో పాల్గొన్న దీపికా పదుకోన్, రణవీర్ సింగ్‌ల మధురమైన కాండిడ్ మూమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటెంట్ క్రియేటర్ ఒర్రీ (ఓర్హన్ అవత్రామాణి) ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాసేపట్లోనే నెట్‌లో సంచలనమైంది. దీపికా ‘ఒర్రీ పోజ్’ చేసినట్టుందని పలువురు అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

రణవీర్ సింగ్ కజిన్ వివాహానికి గోవాలో హాజరైన ఈ జంట ఎరుపు రంగు డ్రెస్సుల్లో జంటగా మెరిసింది. ఓ సందర్బంగా దీపికా రణవీర్ చెవిలో ఏదో చెప్పుతూ, అతని ఛాతీపై చేయి పెట్టిన మధురమైన క్షణం కెమెరాలో బంధితమైంది. ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ ఒర్రీ “Orry stocks #ValidatedByTheQueenHerself (sic)” అని క్యాప్షన్ ఇచ్చాడు.

వీడియో బయటికొచ్చిన వెంటనే అభిమానులు కామెంట్లతో నింపేశారు. ‘కల్కి 2898AD’ హీరోయిన్ దీపికా కూడా స్వయంగా కామెంట్ చేస్తూ, “నీకు తెలుసు కదా, నేను నిన్నెంత ప్రేమిస్తానో! (sic)” అని రాసింది. కొంతమంది దీపిక “చాలా క్యూట్‌గా ఉంది” అని పేర్కొనగా, మరికొందరు “దీపికా ఒర్రీ పోజ్ చేస్తోంది (sic)” అని కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో 6.2 మిలియన్ల వ్యూస్, 2.83 లక్షల లైక్స్ దాటేసింది.

రణవీర్ సింగ్ త్వరలో ‘ధురంధర్’ చిత్రంతో రానున్నాడు. ఆదిత్య డార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో సారా అర్జున్, అర్జున్ రాంపాల్, అక్షయే ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకోన్ చివరగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సింఘం అగైన్’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్’ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది.

Also Read:పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ హ్యాక్!

- Advertisement -