విడాకుల్లేవ్.. హీరో హీరోయిన్లు క్లారిటీ

63
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు పెటాకులు కావడం అనేది కొత్తేమీ కాదు. ముఖ్యంగా బాలీవుడ్ లో గత మూడు తరాల నుంచి విడాకులు తీసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్‌ వీర్‌ సింగ్, దీపికా పదుకొణె త్వరలో విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ ఒక్క ఫొటో షేర్ చేసి రూమర్స్‌కు చెక్‌ పెట్టాడు. దీపికతో కలిసి పడవలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ విడాకుల ప్రచారానికి తెరపడింది.

దీపికా పడుకోణె కూడా తన భ‌ర్త రణవీర్ సింగ్ గురించి చెబుతూ.. తాను తన భర్తతో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అని, తమ సంసారం సాఫీగా సాగడానికి ఎన్నో విషయాలను మేము చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటాం అని, తమ బంధంలో ఎన్నో లోపాలు ఉన్న విషయాన్ని తామిద్దరం అర్ధం చేసుకుంటాం అని, అలాగే తమకు గతంలో ప్రేమ వ్యవహారాల విషయంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్న విషయాన్ని కూడా తమకు ఇంకా గుర్తు ఉందని.. కాబట్టి.. తాము ఎట్టి పరిస్థితుల్లో విడిపోము అని దీపికా చెప్పుకొచ్చింది.

Also Read:భారీ వర్షాలు..తెలంగాణ భవన్‌ని సంప్రదించండి

ఏది ఏమైనా పఠాన్ సినిమాలో దీపికా పడుకోణె చేసిన ఎక్స్ పోజింగ్ విషయంలో రణవీర్ సింగ్ బాగా ఫీల్ అయ్యాడు అనేది నిజం అని టాక్. దీపికా పదుకొణె కూడా పెళ్లి తర్వాత బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా నటిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత దీపికా చేసిన గెహ్రాహియా అనే సినిమాలో కూడా గ్లామర్‌ డోస్‌ ను దీపికా విపరీతంగా పెంచింది.

- Advertisement -