దీపికా..82°E అంటే ఏంటంటే..?

48
- Advertisement -

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకుణె గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా బాయ్‌కట్ ట్రెండింగ్ హవాలో కొనసాగింది. అయితే పఠాన్ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా లాస్‌ఏంజెల్స్‌లో జరిగే ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దీపికా. అయితే తాజాగా ఆమె మెడపై ఉన్న టాటూ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నలుపు రంగు గౌను మరియు నెక్‌పీస్‌తో అందరినీ ఆకట్టుకున్న దీపిక..తన మెడపై 82°E(భారత కాలమానం) అని ఉన్న టాటూ కనిపించేలా ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలోనే టాటూ ఆర్థం ఏంటని నెటిజన్లు నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు.

82°E అనేది..ఆమె కొత్తగా మొదలు పెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు అని బాలీవుడ్‌లో టాక్‌. ఇటీవల దీపికా ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో తన సొంత బ్రాండ్ పేరును టాటూగా వెయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ కమిట్‌మెంట్ అంటే ఇదే అని పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్‌-కే అనే సినిమాలో చూస్తున్నారు. ప్రభాస్‌తో నటిస్తోన్న ఈసినిమాను నాగ్ ఆశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్‌తో కలిసి నటిస్తోంది.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ తో  సంథింగ్.. నథింగ్ అట 

ప్చ్.. తమన్నాతో విసిగిపోయాడా?

చిరుకు షాకిచ్చిన హైకోర్టు..

- Advertisement -