దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి నేరుగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం. SLV సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా DQ41 అనే టైటిల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సినిమాకు రవి నెలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌గా నటుడు దీక్షిత్ శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇటీవల విడుదలైన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఆయన నటన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, DQ41 చిత్ర బృందం దీక్షిత్ శెట్టిని తమ సినిమాలోకి స్వాగతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు పూజా హెగ్డే, రమ్యకృష్ణ వంటి ప్రముఖుల కలయిక ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. DQ41 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటులు, కథాంశం, విడుదల తేదీ వంటి అప్‌డేట్స్‌ను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read:మాస్ అవతారంలో విజయ్..’రౌడీ జనార్ధన’

