ఆర్.కె. ఫిలింస్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్ కుమార్, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి. ఈ సందర్భంగా
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ – మా ‘దీక్ష’ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ పూర్తయ్యింది. వచ్చే వారం ఓ సాంగ్ షూట్ చేయబోతున్నాం. టాకీ పార్ట్ లో ఫైట్ మాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాం. ఈ ఫైట్ లో హీరో కిరణ్ చేసిన స్టంట్స్ హైలైట్ అవుతాయి. మా మూవీలో సింగర్ మధు ప్రియ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో కిరణ్ ‘దీక్ష’ చిత్రంలో భీముడి గా కనిపించే సీన్స్ బాగా వచ్చాయి. ఈ సినిమాలో భీముడు, ఆంజనేయుడు వంటి గెటప్స్ లో ఆకట్టుకునే సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ను పరిచయం చేస్తున్నాం. ‘దీక్ష’ సినిమాను పూర్తి చేసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ‘దీక్ష’ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే మహిళా కబడ్డీ అనే మరో చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఈ సినిమాను 18 భాషల్లో తెరకెక్కంచబోతున్నాం. కబడ్డీ ఆడగల యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మహిళా కబడ్డిలో నటించే హీరోయిన్స్ కు నేషనల్ కబడ్డీ జట్టు కోచ్ తో శిక్షణ ఇప్పిస్తాం. అన్నారు
హీరో కిరణ్ మాట్లాడుతూ – నలభై సినిమాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ గౌడ్ గారు ‘దీక్ష’ మూవీతో మళ్లీ మెగాఫోన్ పట్టడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను ఆర్ కే గౌడ్ గారు ఈ మూవీ కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. దీక్ష ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి యంగ్ డైరెక్టర్స్ లా చాలా అప్డేటెడ్ గా, ప్లానింగ్ తో ఆర్ కే గౌడ్ గారు ‘దీక్ష’ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో నాకు మంచి పేరుతో పాటు అవార్డ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. మా మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. రియలిస్టిక్ గా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేశాం. స్టంట్ మాస్టర్ రవికుమార్ చాలా బాగా ఆ ఫైట్ చేయించారు. ఒక నిమిషం పాటు ఉండే డైలాగ్ ఒకటి ఈ మూవీలో నాతో చెప్పించారు. ఆ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నా లాంటి యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న ఆర్ కే గౌడ్ గారికి థ్యాంక్స్, అలాగే మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మహిళా కబడ్డీ సినిమాను ఆర్ కే గౌడ్ గారు 18 భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ మూవీ కూడా బాగా రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
Also Read:జూలై 3 వరకు కవిత జ్యూడిషియల్ రిమాండ్