తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సూపర్ రియాల్టీ షోగా వచ్చిన బిగ్ బాస్ షో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రమే సూపర్ రేటింగ్సుతో ముందుకు వెళుతున్న బిగ్ బాస్ ఆ తర్వాత చప్పగా మారిపోతోందట. ఈ షో మరో మూడు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరం అయింది. మొత్తం 14 మంది పార్టిసిపెంట్ తో మొదలైన ఈ షో లో ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు.
ఇక షోకి కాస్తా గ్లామర్ డోస్ పెంచేందుకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పేరుతో దీక్షా పంత్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేశారు. పార్టిసిపెంట్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారనీ, దీక్షా పంత్ వచ్చినా తమకు అంతగా హాటెస్ట్ అందాలు సరిపోవడం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకి మ్యాథ్స్ కి సంబందించిన ఒక టాస్క్ ఇచ్చాడు. అయితే అందరు బాగానే ఆడారు. కానీ దీక్ష మాత్రం అతి చిన్న ప్రాబ్లమ్ ని కూడా సరిగ్గా సాల్వ్ చేయలేకపోయింది.
ఆమెకు ఇచ్చిన లెక్కను ఇలా చేసింది -4+4 = ఎంత? దీంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆదర్శ్ క్లూ ఇచ్చినప్పటికీ దీక్షా అదేపనిగా తప్పుగా చేస్తుండడంతో, కంటెస్టెంట్లు తెగ నవ్వుకున్నారు. లెక్కల ప్రకారం ఆన్సర్ “0” అయితే అమ్మడు 8 అని వేయడంతో చిన్నపిల్లలు సైతం హవ్వా అనేట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా బి.కామ్ లో ఫిజిక్స్ అనే స్థాయిలో చేసిందని సైటైర్లు వెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://youtu.be/3vjMScQLSic