KTR:29న జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’

5
- Advertisement -

రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక సంకల్పంతో నవంబర్ 29న అన్ని జిల్లా కేంద్రాల్లో ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆనాడు ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో’ అని తెగువ చూపిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారు అన్నారు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భమే దీక్షా దివస్. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చింది. ఒక్క వర్గం కాదు.. అట్టడుగు వర్గాల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్..తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అన్నారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ గారు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని మన అందరికీ తెలుసు.. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం అన్నారు. .కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ అని వెల్లడించారు.

కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9 రోజున మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం అన్నారు. మా పార్టీ నాయకులంతా ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతాం…. కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనది. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేశాం… దీక్షా దివస్‌తో పాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపు ఇస్తున్నాం అన్నారు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అన్నారు.

Also Read:NRI BRS:యూకే నూతన అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి

- Advertisement -