లోక్‌సభలో అభినందన్ మీసాలపై ఆసక్తికర చర్చ..!

307
Abhinandan Varthaman
- Advertisement -

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ఈ పేరు దేశ ప్రజలందరికీ సుపరిచితమైనదే. పాకిస్తాన్ యుద్ద విమానాన్ని కూల్చేక్రమంలో పాక్ ఆర్మీకి చిక్కి భారత సైన్యం తెగువచూపిన.. అభినందన్ దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. ఆయన మీసకట్టుకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎంతో మంది యువకులు అభినందన్‌ మీసాల స్టైల్‌ను ఫాలో అయ్యారు. తాజాగా లోక్‌సభలో అభినందన్ మీసకట్టుపై ఆసక్తికర చర్చ జరిగింది.

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌కు అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, అభినందన్ మీసాలను ‘జాతీయ మీసాలు’గా ప్రకటించాలని కోరారు.

- Advertisement -