34 వేలు దాటిన మృతులు..

29
- Advertisement -

వరుస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. వారం రోజుల క్రితం వచ్చిన భూకంపం నుండి ఇంకా కొలుకోకముందే ఆదివారం టర్కీ దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.

ఇప్పటివరకు 34 వేల మంది భూకంపంతో మరణించగా తుర్కియేలో 29,605 మంది ఉండగా, సిరియాలో 4,574 మంది ఉన్నారు. భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. భూకంపా మృతుల సంఖ్య 50వేలు దాటవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

భూకంపంతో కష్టాల్లో ఉన్న ఇరు దేశాలకు ప్రపంచం బాసటగా నిలిచింది. పలు దేశాలు వైద్య పరికరాలు, డాక్టర్లను పంపిచాయి. 10 వేల క్యాబిన్లు, క్యారావ్యాన్లను అందించడానికి ఖతార్‌ ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -