- Advertisement -
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు మరణశిక్ష ఖరారైంది. దేశ ద్రోహం కేసులో ముషరఫ్‌కు మరణశిక్షను విధిస్తూ ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. 2007 నవంబర్ 3న పాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన కేసులో ముషరఫ్‌ను దోషిగా తేల్చింది న్యాయస్ధానం.
ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి పాఠాన్ని 48 గంటల్లో రిలీజ్ చేయనున్నారు. 2007, నవంబర్ మూడవ తేదీన ముషర్రఫ్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినట్లు అభిప్రాయపడ్డ న్యాయస్ధానం 2013, నవంబర్ 20వ తేదీన ఈ కేసులో విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. 2014లో ఈ కేసులో ముషర్రఫ్‌ను నిందితునిగా చేర్చారు. జూన్ 19, 2016లో కోర్టు మాజీ అధ్యక్షుడిని నేరస్థుడిగా తేల్చింది.
- Advertisement -