ఆహాలో ‘డియర్ నాన్న’

2
- Advertisement -

యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు.

ఫాదర్ డే స్పెషల్ గా ఈ చిత్రం జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన డియర్ నాన్న ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా బ్యాక్ డ్రాప్, ఫాదర్ ఎమోషన్, చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా క్యురియాసిటీని పెంచాయి.

ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్ యూనిక్ గా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ మనసుని హత్తుకున్నాయి. ఫాదర్స్ డే కి డియర్ నాన్న పర్ఫెక్ట్ ట్రీట్.

ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిత్ కుమార్ మాధాడి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్. కృష్ణ చైతన్య లిరిక్స్ అందిస్తుండగా పివిఎన్ఎస్ రోహిత్ సింగర్.

Also Read:ఆకట్టుకుంటున్న ‘శ్వాగ్’ టీజర్

- Advertisement -