గీతా గోవిందమ్ ఫేమ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా మరోసారి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ కావడం,బాలీవుడ్ అగ్ర నిర్మాత ఈ మూవీ హిందీ రిమేక్ రైట్స్‌ని సొంతం చేసుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వారు ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని…విజయ్ దేవరకొండ,రష్మిక నటన సూపర్బ్ అని ట్వీట్ చేస్తున్నారు. తెరపై వీరిద్దరి కెమిస్ట్రి అద్భుతంగా ఉందని…దర్శకుడు భరత్ కమ్మ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు.
ఇంకొంతమంది ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని చెబుతుండగా మరికొంతమంది సెకండాఫ్ సాగదీసినట్టు ఉందని ట్వీట్లు చేస్తున్నారు. ఒక్కసారి చూడదగిన సినిమా అంటూ కొందరు వెల్లడించారు. మొత్తంగా విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టేశాడని నెటిజన్లు వరుస ట్విట్లు చేస్తున్నారు.
మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణానికి ఏడాదికిపైగా సమయం పట్టింది.