అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ట్రెండ్ సృష్టించిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అసలు విజయ్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. కానీ ఆ చిత్రం ఏకంగా 70 కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ స్టామినా ఏంటో చూపించింది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా కూడా 24 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా బిజినెస్‌కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 11న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ట్రైలర్‌ను వదలనున్నారు. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. కన్నడ భాషల్లోను ఇదే ముహూర్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెరిగిపోతాయన్నది చూడాలి.
భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన, శృతి రామచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు.. జూలై 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు మిగతా మూడు భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.