విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. ప్రస్తుతం ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇటివలే మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఈసినిమాపై పుల్ హైప్ క్రియేట్ చేశారు.
నిన్న సాయంత్రం వైజాగ్లోని గురజాడ కళాక్షేత్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈసందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈసినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. ఒకేసారి 4భాషల్లో విడుదల అవుతున్నందుకు చాలా హ్యాపిగా ఉందని చెప్పారు. ఈసినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. త్వరలోనే ఈసినిమాను హిందీలో కూడా రిమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఈసినిమాలో మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పారు. నా సినిమాల్లో డియర్ కామ్రేడ్ చాలా స్పెషల్ అన్నారు.