డెడ్ పుల్ & వాల్వ‌రిన్.. ఫైన‌ల్ ట్రైల‌ర్

21
- Advertisement -

రోజుకో స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్ తో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డెడ్ పుల్ & వాల్వ‌రిన్ టీమ్. ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్ర‌థాన పాత్ర‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో జూలై 26న విడుద‌లవ్వ‌నున్న చిత్రం డెడ్ పుల్ & వాల్వ‌రిన్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఇప్ప‌టికే వ‌రల్డ్ వైడ్ ఫుల్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ ని మ‌రింత‌గా పెంచేస్తూ డెడ్ పుల్ & వాల్వ‌రిన్ చిత్ర బృందం ఫైన‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు.

ఇప్ప‌టివ‌రుకు విడుద‌లైన ప్ర‌తి వీడియో కంటెంట్ లో ఏదొక స్పెష‌ల్ అప్పీరెన్స్ ను ప‌రిచ‌యం చేస్తూ సినిమాలో డెడ్ పుల్ & వాల్వ‌రిన్ తో పాటు ఇంకా చాలా మంది సూప‌ర్ హీరోలు ఉన్నార‌నే హింట్స్ ఇస్తూ వ‌స్తున్న మార్వెల్ టీమ్, తాజాగా విడుద‌ల చేసిన ఫైన‌ల్ ట్రైల‌ర్ లో కూడా అదే పంధా కొన‌సాగించారు. ఈ ట్రైల‌ర్ లో లేడీ డెడ్ పుల్ అలానే వాల్వ‌రిన్ కూతుర్ని ప‌రిచ‌యం చేశారు. డెడ్ పుల్ చేసే విన్యాసాలును ఎంజాయ్ చేసే మార్వెల్ మూవీ ల‌వ‌ర్స్ ఇప్పుడు లేడీ డెడ్ పుల్ చేసే యాక్ష‌న్ ని కూడా చూడ‌బోతున్నారు. డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఇంగ్లీష్ తో పాటు అనేక భాష‌ల్లో విడుద‌లవ్వ‌నుంది. తెలుగులో డెడ్ పుల్ సిరీస్ కి ఉన్న క్రేజ్ రీత్య డెడ్ పుల్ & వాల్వ‌రిన్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు.

Also Read:భారీ వర్షాలు..కృష్ణమ్మ పరవళ్లు, మేడిగడ్డకు జలకళ

- Advertisement -