తెలుగు ట్రెండింగ్‌లో ‘డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్’

27
- Advertisement -

మార్వెల్ మూవీ యూనీవ‌ర్స్ లో మ‌రో కొత్త సినిమా ఫ్యాన్స్ ను ఉర్రూత‌లుగించేందుకు రెడీ అయింది.డెడ్ పుల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ సినిమా ఈ జూలై 26న విడుద‌ల‌వ్వ‌నుంది. ఈ సినిమాలో సూప‌ర్ హీరో డెడ్ పుల్ తో పాటు మిలీనియ‌మ్ సూప‌ర్ హీరో ఎక్స్ మెన్ లో మోస్ట్ ఫెవ‌రేట్ వాల్వ‌రిన్ కూడా సిల్వ‌ర్ స్రీన్ పై ఫైట్లు చేయ‌బోతున్నాడు.

దీంతో ఒకేసారి ఇద్ద‌రు హీరోలు చేయ‌బోయే అద్భుత‌మైన విన్యాసాల‌ను మూవీ ల‌వ‌ర్స్ డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ ద్వారా వీక్షించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్స్ కు వ‌రల్డ్ వైడ్ విప‌రీతంగా క్రేజ్ ఏర్ప‌డింది, ఈ నేప‌థ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాష‌ల్లో ఉన్న సినీ అభిమానుల‌ను మ‌రింత అల‌రించే విధంగా తీర్చిదిద్దేందుకు డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ను సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా డ‌బ్బింగ్ ఫ్యాన్స్ ను అత్యంత ఆకట్టుకుంద‌నే విష‌యం తెలుగు ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది.

తెలుగులో ఉన్న ట్రెండింగ్ ప‌దాల‌ను, యూత్ మ‌ధ్య విప‌రీతంగా వినిపించే ప‌దాల‌తో ఉన్న డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ అవ్వ‌నున్నాను. తెలుగు సినీ అభిమానులు ఇటీవ‌ల ఇష్ట‌ప‌డిన కుర్చీమ‌డ‌త‌పెట్టి, కెవ్వుకేక‌, రింగ రింగ ఇలా అనేక అన్ లైన్ ట్రెండింగ్ కీ వ‌ర్డ్స్ తో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగు వెర్ష‌న్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వ‌రిన్ గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్ గా ర‌య‌న్ రెనాల్డ్స్ క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల అవుతుంది.

Also Read:హాయ్ జగన్…వైసీపీ అధినేతతో రఘురామరాజు

- Advertisement -