ఐపీఎల్ 2025లో భాగంగా థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్‌కు వరకు సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయాన్ని నమోదుచేసింది. 210 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలగా కనీసం 150 పరుగులు అయినా చేస్తారా అని అభిమానుల్లో సందేహం నెలకొన్న తరుణంలో అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ అద్భుతం చేశారు.
విప్రాజ్ నిగమ్ 15బంతుల్లోనే 39 పరుగులు చేయగా అశుతోష్ శర్మ 30 బంతుల్లో 66నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సిక్సర్‌తో జట్టును గెలిపించి శభాష్ అనిపించాడు. అయితే ఢిల్లీ గెలుపుకు పరోక్షంగా కారణమయ్యాడు పంత్. చివరి వికెట్ స్టంప్ ఔట్‌ను మిస్ చేయడంతో లక్నో ఓడిపోవాల్సి వచ్చింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణత ఓవర్లలో 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 72, పూరన్ 75 పరుగులతో చెలరేగడంతో లక్నో భారీ స్కోరు సాధించింది.ఇక ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
Also Read:ముంబైపై చెన్నై…రాజస్థాన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ గెలుపు