ఆసీస్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో వార్నర్‌

314
warner
- Advertisement -

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్టీవ్ స్మిత్,డేవిడ్ వార్నర్‌లపై ఏడాదిన్నర కాలంపాటు వేటు పడిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో కుంగిపోతున్న ఆసీస్ వీరిద్దరిపై వేటను ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఈ వార్తలకు నిజం చేకూరేలా ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లో సందడిచేశాడు డేవిడ్ వార్నర్.

భారత్‌తో టెస్ట్ సిరీస్‌ కోసం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సాధన చేస్తున్న ఆసీస్ పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జాస్ హేజల్ వుడ్, పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లో వార్నర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. టీమిండియా బ్యాట్స్ మెన్లను ఎలా ఎదుర్కొవాలో సూచనలు చేశాడట వార్నర్.

వార్నర్‌తో పాటు ఆసీస్ బౌలింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేసేందుకు సిద్దమయ్యారు స్మిత్. జట్టుకు దూరమైన వీరిద్దరూ ఇలా ఆసీస్ బౌలర్లకు సహయపడుతున్నారు. డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా భారత్‌తో తొలిటెస్టులో తలపడనుంది ఆసీస్‌. టీ20 సిరీస్‌ సమం కావడంతో టెస్టు సిరీస్‌పై ప్రత్యేకదృష్టిసారించింది ఆసీస్.

- Advertisement -