మాజీ బ్యాంక్ మేనేజర్ దావులూరి పద్మావతి ఆగడాలు ఆగడం లేదు. బ్లాక్ మెయిలింగ్, హనీ ట్రాప్, 11 కేసులు.. లక్షల్లో మోసగించడం, బంగారం, డబ్బు దోచుకోవడం, బెదిరింపులు.. తన నేర ప్రవృత్తిగా మార్చుకుంది. ఇటీవల కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై దాడికి పాల్పడింది.
చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేసిన ప్రభావతి.. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు జనసేన నాయకుడు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలో స్థానిక జనసేన నాయకులను సమగ్ర వివరాలు కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అయితే ఈ వ్యవహారాలను చూసుకున్న దోనవల్లి వెంకట్రావు.. పవన్ కళ్యాణ్‌కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడని కక్ష పెంచుకుంది ప్రభావతి. ఈ క్రమంలో వెంకట్రావు పై ప్రభావతి, తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడికి పాల్పడింది.
చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టడాన్ని గమనించి ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు గ్రామస్థులు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించిన నూజివీడు రూరల్ పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంబించారు.
Also Read:జాక్..రిలీజ్ డేట్