ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంతో చురుగా ఉంటాడు. వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి భారతీయ సినిమాల పాటలకు స్టెప్పులు వేస్తూ నెటింట్లో వీడియోలు పోస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ సంతోషంగా ఉండడానికే ఈ ప్రయత్నం చేసినట్లు వార్నర్ తాజాగా తెలిపారు.
మన ఆలోచనలు పరిధిని మించి ఉండాలని చెప్పాడు. అందుకే తన కుటుంబసభ్యులతో కలిసి తాను ఆ వీడియోలు చేయగలిగానని చెప్పాడు. తాము మొదట అభిమానులతో ముచ్చటించి వారికేం కావాలో అడిగేవాళ్లమన్నాడు. అభిమానులు తమ అభిప్రాయాలు చెప్పేవారని, వారి సూచనల ప్రకారమే తాము మొదట ‘బుట్టబొమ్మ’ పాటకు డ్యాన్స్ చేశామని చెప్పాడు. తరువాత కూడా వరుసగా డాన్స్‌లు చేస్తూ వీడియోలు పెట్టామని తెలిపాడు. ఇండియన్ స్టెప్పులు వేయడం చాలా కష్టమని, వాటిని చేయాలంటే చాలా శ్రద్ధ పెట్టాలని వార్నర్ తెలిపాడు.