రాజేంద్రప్రసాద్ కామెంట్స్‌పై వార్నర్!

20
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాబిన్‌హుడ్. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా మార్చి 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీయగా దీనికి సారీ కూడా చెప్పారు రాజేంద్రప్రసాద్. వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ , డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో చాలా క్లోజ్… షూటింగ్ గ్యాప్‌లో ఇద్ద‌రు స‌ర‌దాగా మాట్లాడుకున్నారు అన్నారు.

ఈ విష‌యం గురించి వార్న‌ర్‌కి చెబితే ఇట్స్ ఓకే అన్నారు…నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా? మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది. మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత అని వార్న‌ర్ లైట్ తీసుకున్నారు అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు. భీష్మ త‌ర్వాత నితిన్, వెంకీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:పెద్దన్న లెక్క భట్టిని గౌరవిస్తా: కేటీఆర్

- Advertisement -