నన్ను వ్యక్తిగా మార్చింది -ధోనీ

220
MS Dhoni

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కూతురు జీవా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జీవా తననో పూర్తిస్థాయి వ్యక్తిగా మార్చిందని అన్నాడు. తన జీవితంలో చాలా మార్పులకు ఆమె కారణమన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ షోలో పాల్గొన్న మహీ మాట్లాడుతూ.. ‘‘తండ్రి అయ్యాక క్రికెటర్‌గా నాలో ఏమైనా మార్పులొచ్చాయో ఏమో తెలియదు. కానీ వ్యక్తిగా మాత్రం మారాను. ఎందుకంటే అమ్మాయిలతో తండ్రులకు సాన్నిహిత్యం చాలా ఎక్కువ’’ అని ధోని అన్నాడు. జివా పుట్టినపుడు, తర్వాతి రోజుల్లో తనతో ఎక్కువ సమయం గడపలేకపోవడం పట్ల మహి విచారం వ్యక్తం చేశాడు.

MS Dhoni

అసలు సమస్యేంటంటే జీవా పుట్టినపుడు నేను తన దగ్గర లేను. తర్వాత కూడా ఎక్కువగా క్రికెట్‌ ఆడుతూ గడిపాను. దీంతో తను తిండి తిననపుడల్లా ‘నువ్వు తినేస్తే నాన్న వస్తాడు’ అనడం.. అల్లరి చేస్తుంటే ‘నాన్నొస్తాడు ఊరుకో’ అని బెదిరించడం చేశారు. దీంతో నన్ను చూడగానే జివా కొంచెం భయపడటం అలవాటు చేసుకుంది’ అని చెప్పాడు.

ఈసారి ఐపీఎల్‌ సందర్భంగా జీవాతో సమయాన్ని చాలా ఆస్వాదించినట్లు ధోని తెలిపాడు. ‘‘ఈ సీజన్‌ మొత్తం జివా మ్యాచ్‌లకు హాజరైంది. తనను మైదానంలోకి తీసుకెళ్లాలన్నది పెద్ద కోరిక. అది తనకు ఆట స్థలం. జట్టులోని మిగతా సహచరుల పిల్లలూ వచ్చేవాళ్లు. నేను మధ్యాహ్నం 1.30-3 గంటల మధ్య లేచేవాడిని. అప్పటికి పిల్లలతో కలిసి జీవా బాగా ఆడుతూ కనిపించేది. వాళ్లను చూస్తూ మేం సేదదీరేవాళ్లం’’ అని ధోని అన్నాడు.