బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు సరికావన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ప్రభుత్వ నిబంధనల మేరకే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. నాటి నుంచి నేటి వరకు మేం ప్రభుత్వ విధానాల ప్రకారం పార్టీ కార్యక్రమాలకే ఆ కార్యాలయాన్ని వినియోగించాం అన్నారు.
ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ అవసరాలకు వినియోగించవు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కమర్షియల్‌గా కిరాయికి ఇచ్చారు అని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఏ రోజు ఇతర పార్టీ నాయకులు, కార్యాయలాలపై ప్రతీకార చర్యలకు పాల్పడలేదు అన్నారు. అన్ని పార్టీల కార్యకర్తల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాను అని చెప్పారు దాస్యం.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్ని ఖాళీ చేయాలన్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేని స్థానిక ఎమ్మెల్యే… మా పార్టీ కార్యాలయం జోలికి రావడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారు…. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.
Also Read:ఎంపీ పదవికి కేశవరావు రాజీనామా