కాంగ్రెస్‌ది జలదీక్ష కాదు… జలగల దీక్ష..

761
Dasyam Vinay Bhaskar
- Advertisement -

కాంగ్రెస్ నాయకులది జలదీక్ష కాదు.. జలగల దీక్ష అని ఎద్దేవ చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఆయన ఈరోజు వరంగల్ అర్బన్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకుల చేస్తున్న దీక్షలపై ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ నాయకులు గతంలో జలయజ్ఞం పేరుతో దనయజ్ఞం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని వినయ్‌ భాస్కర్‌ మండిపడ్డారు.

రైతులకు 365 రోజులు సాగునీరు అందడంతో సంవృద్దిగా పంటలు పండి సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో వర్ష కాలంలో చెరువులు ఎండిపోతే.. ఇప్పుడూ టీఆర్‌ఎప్‌ పాలనలో ఎండాకాలంలో కూడా నిండు కుండల ఉన్నాయన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం…కాంగ్రెస్ చేస్తున్న జల దీక్షలకు ప్రజా స్పందన కరువైందని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -