పెట్టుబడిదారులకు అడ్డ…బీజేపీ: స్వామి గౌడ్ – శ్రవణ్‌

34
- Advertisement -

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి శాసన మండలి చైర్మన్ ఉద్యమ కాలంలో ఎన్నో పోరాటాలు చేసిన స్వామిగౌడ్ మేధస్సు కలిగిన నాయకుడు శ్రవణ్ తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పని చేసిన సహచరులం మేం. అక్కడక్కడ ఫంక్షన్లలో, ఇతర కార్యక్రమాల్లో కలుసుకునే వాళ్లం. ఆ సమయంలో పార్టీలను పక్కన పెట్టి ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్లం.. అనుబంధాన్ని పంచుకున్నా.. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామని గుర్తు చేశారు.

ఉద్యమంలో పని చేసిన ప్రతి బిడ్డ.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు, కార్యక్రమాలను గమనించి వందకు వంద శాతం.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.

స్వామిగౌడ్‌ మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమానికి సీఎం కేసీఆర్ పిలుపుమేరకు కసికొద్ది రాష్ట్రము కొసం పనిచేశామన్నారు. సరిగ్గా ఇదే రోజు సిద్దిపేటలో ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరం పాలు పంచుకున్నామని చెప్పారు.

జాతీయ పార్టీతో విభజన సమస్యలు తీరుతాయని ఆశతో ఆ పార్టీలో చేరామన్నారు. సంవత్సరం నుండి అడుగుతున్నాం కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు. తెలంగాణ ఆంధ్రల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సమస్యలను రాష్ట్ర పార్టీగా ఉంటే సమస్యలకు పరిష్కారం దొరకదని భావించిన సీఎం కేసీఆర్‌…. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌గా మార్చడం వల్లే బీజేపీకి భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్‌ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్వామిగౌడ్‌ అన్నారు.

దాసోజు శ్రవణ్….
కన్న తల్లి లాంటి పార్టీని వదిలి వేరే పార్టీలో జాయిన్ అయ్యిన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు దాసోజు శ్రవణ్‌. ఉద్యమాన్ని కేసీఆర్‌ నాడు నడుపుతున్న తీరును చూసి ఆయనను స్పూర్తిగా తీసుకుని పార్టీలో చేరానని అన్నారు. ఎన్నో కష్టాల మధ్య ఏర్పడ్డ తెలంగాణ నేడు దేశానికి తలమానికంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్‌కు ధన్యావాదములు తెలిపారు.

దేశ సంపద సబ్బండ వర్గాలకు చేరేవిధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలను రూపొందించారని గుర్తు చేశారు. ఇలాంటి పథకాలు మరేవరూ తయారు చేయలేరన్నారు. అనితర సాధ్యము కానీ కాళేశ్వరంను దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసిన అపరభగీరథుడు మన సీఎం కేసీఆర్‌ అని అన్నారు. బీజేపీలో శ్రుద్ర రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.

బీజేపీ నాయకులు పెట్టుబడిదారులకు వంతపాడుతున్నారని శ్రవణ్‌ మండిపడ్డారు. కేవలం మునుగోడు గెలుపు కోసం బీజేపీ విపరీతంగా ఖర్చు పెడుతున్నారో చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నాప్రాణం ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు.

- Advertisement -