నిన్న యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన శ్రవన్…పాచి కల్లు తాగిన వాళ్ళ లెక్క కేసీఆర్ పై మాట్లాడారు అన్నారు. కేసీఆర్ 40 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు…పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు అన్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా,ఒక సారి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేశారు..రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్లు గల్లీ రౌడీలు కూడా మాట్లాడరు అన్నారు.
కేసీఆర్ వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని దుయ్యబట్టారు. కాలకేయుడిలా రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి మాట్లాడారు,రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బర్త్ డే విషెస్ చెప్పలేదని భాదతో మాట్లాడినట్లు ఉన్నారు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు,సీఎం పదవి పోతుందని ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నారు.
రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనం అయింది…జీవో 29 తో బీసీ,ఎస్సి,ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు అన్నారు. మూసీ అభివృద్ధి చేయవద్దని కేటీఆర్,హరీష్ రావు ఎప్పుడైనా వద్దన్నారా…? అన్నారు. డీపీఆర్ లేకుండా ఇళ్లను కూలుస్తున్నారు,మూసీ అభివృద్ధి పేరుతో జీవన విధ్వంసం చేస్తున్నారు అన్నారు. మూసీ ప్రాజెక్టును అదానీ,మెగా క్రిష్ణారెడ్డికి అప్పగించే కుట్ర చేస్తున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమైనా గంజాయి తాగి మాట్లాడుతున్నారా చెప్పాలన్నారు. మూసీ అభివృద్ధికి డీపీఆర్ అడిగితే తప్పా…?, పది నెలల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టని విధంగా రేవంత్ రెడ్డిని ప్రజలు తిడుతున్నారు అన్నారు. పాదయాత్ర ద్వారా మూసీ అభివృద్ధితో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ ను తిట్టడానికే రేవంత్ రెడ్డి పాదయాత్ర పెట్టుకున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి సంకర జాతి భాష మాట్లాడుతున్నారు..రాహుల్ గాంధీ భాష ఇది కాదు రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు…నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేసింది కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిని ఎండగడతాం అన్నారు.
Also Read:మూసీ సమస్యపై పాదయాత్రకు సిద్ధం:హరీశ్