హస్తవ్యస్త కాంగ్రెస్‌ …అంతా రేవంత్‌ వల్లే : దాసోజు శ్రవణ్‌

33
dasoju
- Advertisement -

కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పడం లేదు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఒక్కొక్కరూగా పార్టీని వీడుతున్నారని దాసోజు శ్రవణ్‌ తెలిపారు. రేవంత్‌ ఓ బ్లాక్‌ మెయిలర్‌ గా పని చేస్తున్నారన్నాయన….పీసీసీగా ఉన్నంత వరకు పార్టీ బాగుపడదని చెప్పారు. దాసోజు శ్రవణ్‌ మరికాసేపట్లో రాజీనామా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కరువైందన్న ఆయన… రేవంత్ రెడ్డి ఆధిపత్య రాజకీయాల వల్లే పార్టీని వీడుతున్నారని శ్రవణ్ స్పష్టం చేశారు. రేవంత్ ఒంటెత్తు పోకడతో వన్ మ్యాన్ షో చేస్తున్నారని అందుకే పార్టీ ఆగమవుతోందని విమర్శించారు. రేవంత్ తన వర్గం నేతల కోసం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు చాలా మంది నేతలు పార్టీ వీడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీపీసీసీ రేవంత్ తీరుపై చాలా మంది నేతలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ అందరూ మౌనంగానే ఉన్నారని శ్రవణ్ చెప్పారు.

- Advertisement -