అలుపెరుగని సినీ కార్మికుడు..

313
dasari narayana rao birthday
- Advertisement -

అత్యధిక చిత్రాల దర్శకుడుగా అనతి కాలంలోనే గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు దర్శకరత్నదాసరి నారాయణరావు. తెలుగు సినిమా చరిత్రలో సినిమాపెద్ద దాసరి నారాయణరావు ది ఓ సువర్ణాధ్యాయం. బహుముఖ ప్రజ్ఞాశాలి.. అలుపెరగని సినీ కార్మికుడు. తెలుగు సినిమాకు ఆయన అందించిన విజయాలను వర్ణించడం అసాధ్యం. ఎందరినో స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది.

`తాతా మనవడు` నుంచి మొన్నటి `ఎర్ర బస్సు` వరకూ ఎన్నో విజయాలను అందుకున్నారు. కాగా నేడు (గురువారం) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలను మరోసారి గుర్తుచేసుకుందాం. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. 250 పైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
dasari narayana rao birthday
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవారు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఒకానొక సమయంలో ఆయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు `తాతా మనవడు`, `స్వర్గం నరకం`, `మేఘసందేశం`, `మామగారు` అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆయన సినిమాలు ముఖ్యంగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన `బొబ్బిలి పులి` `సర్దార్ పాపారాయుడు` చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
 dasari narayana rao birthday
`మామగారు`, `సూరిగాడు`, `ఒసేయ్ రాములమ్మా` చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో దాసరి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డులు కూడా లభించాయి. అలాగే జాతీయ ఆయన మరెన్నో అవార్డులు అందుకున్నారు.

ఇదిలాఉండగా..దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకను నేడు ఆయన నివాసంలో సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. కొద్ది కాలం క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న దాసరి ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, కార్మిక నేతలు, సినీ కార్మికులు దాసరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో దాసరి కేక్‌ను కట్ చేశారు.

- Advertisement -