సినీ దర్శక నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం కిడ్నీ సమస్యతో దాసరి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. ఓవర్ వెయిట్, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని.. సర్జరీ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెబుతున్నారు వైద్యులు.
దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సినీ ప్రముఖులు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. 2014లో మంచు విష్ణు హీరోగా ఎర్రబస్సు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఇంతవరకూ ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
అయితే అక్కడక్కడా సినీ ఫంక్షన్స్‌లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. చిరుపై ప్రశంసలు గుప్పించారు. ఇక చిరు 150వ సినిమాకు ఖైదీ నెంబర్ 150 పేరును ఖరారు చేసింది దాసరే. త్వరలో పవన్ కల్యాణ్‌తో సినిమా తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అనేక సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డు సాధించారు దాసరి. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.