దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి వివాదాలు రచ్చకెక్కాయి. దాసరి పెద్ద కొడుకు ప్రభు- చిన్న కొడుకు అరుణ్ మధ్య విభేదాలు తారస్ధాయికి చేరగా ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రి దాసరి అరుణ్ తన ఇంట్లోకి గేటు దూకి రావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దాసరి అరుణ్..ఆస్తి వివాదానికి సంబంధించి కీలక కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించిన తన తండ్రి ఇంట్లోనే సమస్య రావడం చాలా బాధగా ఉందన్నారు. మేం తిట్టుకుని కొట్టుకుంటే కొంతమందికి వెదవల్లా కనిపిస్తున్నాం….కానీ తనకు సిస్టర్, బ్రదర్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు.
మా అన్నయ్య ప్రభుకు ఏవైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడాలి కానీ ఇండస్ట్రీ పెద్దలను నిందించడం ఎంతవరకు సమంజసం అన్నారు. తనకు కొరియర్ వచ్చిందని చెబితే తీసుకోవడానికి వెళ్లానని….అరగంటపాటు డోర్ కొట్టినా తీయలేదు కాబట్టి గేట్ దూకి వెళ్లానని చెప్పారు.తాను తాగి గొడవ చేశాననే ఆరోపణల్లో నిజం లేదన్నారు. మోహన్ బాబు, సీ కళ్యాణ్, మురళీమోహన్ అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.. వాళ్లు ఏం చేశారు. ముందు తనతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.