Dasara:బాంచత్..బాక్సాఫీస్ షేక్

40
- Advertisement -

శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో నాని- కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఓవర్సిస్‌తో సహా అన్ని భాషల్లో సత్తాచాటి మంచి వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమాతో నాని మరోసాని తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇక తొలి సినిమానే అయినా దర్శకుడు శ్రీకాంత్ అద్భుతంగా తెరకెక్కించాడు.

ప్రీమియర్లు, తొలిరోజు కలుపుకుని ఈ సినిమా ఏకంగా $850K పైగా వసూళ్లను రాబట్టినట్లుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. నాని కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని వారు పేర్కొన్నారు. ఈ లెక్కన శుక్రవారం నాడు దసరా సినిమా అలవోకగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెడుతుందని వారు తెలిపారు.

శనివారం ఉదయం నాటికి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను కూడా క్రాస్ చేస్తుందని సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ సినిమా ఇదే జోష్‌లో తన రన్ కొనసాగిస్తే, ఓవర్సీస్ మార్కెట్‌లో నాని తన సత్తాను మరింతగా పెంచుకోవడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -