కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగవరోజు కూష్మాండదుర్గ అలంకార రూపంలో అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి కుడివైపు పద్మము, బాణం, ధనస్సు , కమండలం, ఎడమవైపు చక్రం, గధ, జపమాల, అమృత కలశం, దరించి శ్రీశైల మహాక్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది.
దసరా మహోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో కూష్మాండదుర్గ అలంకార రూపంలో ఉన్న అమ్మవారికి కైలాస వాహనంలో ఉన్న మల్లికార్జునస్వామివారికి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హరతులిచ్చారు.
అనంతరం శ్రీశైల పురవీధులలో గ్రామోత్సవం జరగాల్సి ఉండగా అనుకోకుండా వర్షం కురవడంతో వర్షం కారణంగా స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం రద్దయింది. దీనితో శ్రీశైలం ఆలయం చేరుకున్న భక్తులు కూష్మాండదుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు.