దసరా బరిలో స్టార్స్ బిగ్ ఫైట్…

198
- Advertisement -

పండుగలకు కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. గతంలో పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాలు అన్నీ కూడా పెద్ద పండుగలకు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యేవి. కాంపిటీషన్ ఎక్కువుంటాయని తెలిసిన కూడా నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వరుస సినిమాలను లైన్లో పెట్టేసేవారు. చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ వేసవి తరవాత సంక్రాంతి, దసరా సీజన్లు కీలకం. వరుసగా వచ్చే సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వరుసగా సినిమాల్ని దించేస్తుంటారు నిర్మాతలు. దాదాపు ఆరు ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్‌కి దిగిపోతున్నాయి.

dhruva-movie

దసరా బరిలో నిలిచేందుకు ముందుగా రామ్‌ చరణ్‌ తన బెర్త్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. ధృవ అనే టైటిల్‌ తో రానున్న చిత్రం త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని అక్టోబర్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. అయితే మొన్నటి వరకు ఈ చిత్రానికి పోటీ ఉండదని భావించారు. కాని అనుకోకుండా అనేక సినిమాలు దసరా బరిలో పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు సెప్టెంబరు నెలాఖర్లో అనుకున్న కళ్యాణ్ రామ్-పూరిల ‘ఇజం’ కూడా దసరాకే రానున్నట్లు సమాచారం.

Premam

చందు మొండేటి, చైతూ కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రేమమ్ సెప్టెంబర్లోనో రిలీజ్ కావలసి ఉన్నా అనుకోకుండా ఈ చిత్రం దసరా రేసులోకి వెళ్లింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’కి ఇది రీమేక్‌. నాగచైతన్య, శ్రుతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోనా కీలక పాత్రలు పోషించారు.

tamanna

దాదాపుగా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం అభినేత్రి.తమన్నా నటించిన తొలి కథానాయిక ప్రాధాన్య చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించారు. ప్రభుదేవా, సోనూసూద్‌ కీలక పాత్రధారులు. వినోదంతో పాటు, హారర్‌ జోడించి తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో తన స్టెప్పులతో అదరగొట్టింది తమన్నా.

Sunil

ఈ దసరాకే ‘ఈడు గోల్డ్‌ ఎహె’ అంటూ వస్తున్నాడు సునీల్. ‘దూసుకెళ్తా’ తరవాత వీరూ పోట్ల తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.ఈ చిత్రానికి సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, నిర్మాత: అనిల్‌ సుంకర. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్‌కు.ఈ విజయదశమి ఎలాంటి బహుమతి ఇస్తుందో చూడాలి.

Jaguar-Telugu

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ నటించిన జాగ్వార్ కూడా దసరా బరిలో నిలవనుంది. దాదాపుగా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ‘బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథని అందించారు.ఓ కథానాయకుడి పరిచయ చిత్రాన్ని ఈ స్థాయి బడ్జెట్‌లో తెరకెక్కించడం దక్షిణాదిలోనే ఇది తొలిసారి. దసరా పెద్ద హాలిడే సీజన్ కాబట్టి పండుగ కలెక్షన్లను క్యాష్ చేసుకోవాలని చాలా మంది హీరోలు భావిస్తున్నారు. మరిసారైనా దసరా సీజన్ మన హీరోలకు కలిసొస్తుందో చూడాలి.

Kalyan ram- ISM

- Advertisement -