విధ్వంసకర ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు వెస్టిండీస్. 1990 దశకంలో విండీస్‌తో మ్యాచ్ అంటే ప్రత్యర్ధిజట్లు గజగజవణికేవి. విండీస్ బౌలర్ల బౌన్సర్స్ ధాటికి ప్రత్యర్ది బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకు జంకేవారు. ఓ రకంగా చెప్పాలంటే విండీస్ మ్యాచ్ గెలిచేందుకు పేస్ బౌలింగే ఒక ఆయుధం.
అయితే ఈ నేపథ్యంలోనే ఐసీసీ కొత్తరూల్ తీసుకొచ్చింది. ఒక్క ఓవర్‌కి ఒక్క బౌన్సర్ మాత్రమేవేయాలని రూల్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇదే రూల్ అన్ని ఫార్మాట్లకు వర్తింపజేసింది ఐసీసీ.
దీనిపై వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డారెన్ సమీ…ఐసీసీపై సంచలన ఆరోపణలు చేశాడు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల కట్టడికి అప్పట్లో బౌన్సర్ రూల్‌ని ఐసీసీ) తెరపైకి తెచ్చిందని ఆరోపించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు సంధించే సమయంలో కనిపించని రూల్.. వెస్టిండీస్ పేసర్లు సక్సెస్ అవుతున్నప్పుడు అమల్లోకి తీసుకొచ్చారని సామీ ఆరోపణలు గుప్పించాడు.