సీతారామం కోసం ప్రభాస్..!

29
- Advertisement -

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా తమిళ్, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ హైదరాబాద్‌లో జరుగనుండగా అతిథిగా రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్, ప్రభాస్ ఇద్దరూ ఒకే స్టేజిపై కనువిందు చేస్తుండటంతో ఈ ఈవెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సుమంత్, రష్మిక, తరుణ్ భాస్కర్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

- Advertisement -