ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన యూనిక్ రోమ్-కామ్ ‘డార్లింగ్’ హిలేరియస్ టీజర్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.
డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఓ యంగ్ కపుల్ స్టొరీ ఇది. హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది. ఆమెను దుష్టశక్తి ఆవహించిందని చాలామంది అనుకుంటుండగా, ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తేలుతుంది.
మేకర్స్ ట్రైలర్ ద్వారా సినిమా స్టొరీ లైన్ డిస్ క్లోజ్ చేసినప్పటికీ, కథలో కొన్ని మలుపులు ఉన్నాయి. లీడ్ పెయిర్‌కి బలమైన క్యారెక్టరైజేషన్స్ రాశాడు దర్శకుడు అశ్విన్ రామ్. పెళ్లి గురించి కలలు కనే యువకుడి పాత్రలో ప్రియదర్శి అత్యద్భుతంగా నటించారు, నభా పాత్రకు డిఫరెంట్ లేయర్స్ వున్నాయి. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ పాత్రకు కొత్త కోణాన్ని యాడ్ చేస్తోంది.
అనన్య నాగళ్ల ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించింది. ఒకే ఒక్క సీక్వెన్స్‌లో బ్రహ్మానందం తన ప్రజెన్స్ ని చాటుకున్నారు. ట్రైలర్ ప్రామెసింగ్ గా వుంది, సినిమా మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని హామీ ఇచ్చింది.
Also Read:డబ్బింగ్లో ‘బచ్చల మల్లి’