డార్లింగ్..సెన్సార్ పూర్తి

21
- Advertisement -

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన యూనిక్ రోమ్-కామ్ ‘డార్లింగ్’ హిలేరియస్ టీజర్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఓ యంగ్ కపుల్ స్టొరీ ఇది. హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది..తర్వాత ఏం జరుగుతుంది?, కథ ఎలా సుఖాంతం అవుతుందనేదే సినిమా కథ.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.

Also Read:‘కన్నప్ప’.. తిన్నడు విల్లు విశేషాలు

- Advertisement -